Verse
మాట్లాడే యేసయ్యా
నాతో మాట్లాడుచున్నాడు‖ 2x ‖
(నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ‖ 2x ‖
చంటి బిడ్డలాగ కాయుచున్నాడు‖ 4x మాట్లాడు ‖
Verse
వెన్నలాంటి కన్నులలో
కురిసే తన ప్రేమను పంచాలని‖ 3x ‖
వేకువనే తట్టుచున్నాడు
కునుకని నిద్రపోని నా యేసయ్యా‖ 2x ‖
తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు
లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు‖ 2x మాట్లాడు ‖
Verse
అరుణోదయమున నేను లేచి
కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను‖ 3x ‖
ఉత్సాహగానముతో యేసయ్యను
సంగీత స్వరములతో ఘనపరచెదను‖ 2x ‖
ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు
ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు‖ 2x మాట్లాడు ‖
Verse
లోకము నుండి నన్ను ప్రత్యేకించి
మైమరిపించాడు మహనీయుడు‖ 3x ‖
ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు
జీవముగల సంఘములో నిలిపియున్నాడు‖ 2x ‖
తన మాటతో నన్ను బలపరచాడు
కృప వెంబడి కృపతో నను నింపుచున్నాడు‖ 2x మాట్లాడు ‖