Verse
మాట్లాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువా
నీ మాటలే జీవపు ఊటలు నీ పలుకులే ప్రాణాధారాలు‖ 2x ‖
Verse
సమరయ స్త్రీతో మాటాడావు
సకల పాపములు హరియించావు‖ 2x ‖
జీవ జలములు త్రావనిచ్చావు‖ 2x ‖
జీవితమునే మార్చివేసావు‖ 2x ‖
Verse
చచ్చిన లాజరును చక్కగ పిలిచావు
బయటకు రమ్మని ఆదేశించావు‖ 2x ‖
కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు‖ 2x ‖
మళ్ళీ బ్రతుకును దయచేసావు‖ 2x ‖