Verse
మాయ లోకము - మోసపోకుము
యేసునందే రక్షణ దొరుకును నీకు
Verse
బంధుమిత్రులు - భార్య బిడ్డలు - ధనము ఘనము అందచందము
అవి అన్నియును - నీటిబుడగలె సమాధితోనే - సమాప్తమౌను
Verse
పడగ విప్పిన - పామువలె నీ - పాపము నిన్ను వెంబడించును
పాప ఫలితము - మరణమేగదా దాని అంతము నిత్యనరకము
Verse
నిన్ను రక్షింపనెంచి ప్రభువు - పరమును విడచి - ధరకువచ్చెను
నీకు బదులుగా - శ్రమల నోర్చెను - సిలువలోనే బలియాయె నేసు
Verse
ఇప్పుడైనను - ఒప్పుకొనుమిక - నీ పాపజీవితము నంతయు
నిన్ను క్షమించును కృపతో ప్రభువు - ఇదియే నీ రక్షణ దినముగా
Verse
దేహమంత ప్రభు గాయముల్ పొందె - పరిశుద్ధ రక్తమును
కార్చెను - నిత్యజీవము నీకు నీయను - మృతిని గెల్చి తిరిగిలేచెను