Verse
మాయాలోక ఛాయల్లోన మోసం నాశనం ఉన్నాది‖ 2x ‖
నమ్మబోకు నమ్మబోకు సోదరా
ఈ మాయ లోకం నమ్మబోకు సోదరీ‖ 2x ‖
లోకమంతా తిరిగెదవా – లోకము నిన్నే ఏలునురా‖ 2x ‖
లోక రక్షకుడేసుని మాటకు లోబడుమిప్పుడే సోదరా
అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు
అన్నా మీరేమిట్లు – మనమే దేవుని పనిముట్లు
రొక్కాము లేకుండానే స్వర్గానికి పోదాం రండి
అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు
అన్నా మీరేమిట్లు – మనమే దేవుని పనిముట్లు
Verse
ప్రేమ గల దేవుడమ్మా – ప్రేమతో వచ్చాడమ్మా
రమ్మని పిలుచుచున్నాడు.. నిన్ను
అమ్మలా ఆదరిస్తాడు – అయ్యలా ఆదుకుంటాడు‖ 2x ‖
ఎంత ఘోర పాపివైన చింత లేదురా
సంతసమును నీకీయ స్వర్గము విడి యేసయ్యా
స్వర్గము విడి యేసయ్యా
చెంత చేరి ఈ క్షణమే సేదదీరుము
అంతు లేని ప్రేమలోనే మునిగి తేలుము
సమయమిదే కనుగొనుమా – త్వరపడు సుమ్మా –‖ 2x ప్రేమ గల ‖
Verse
చెప్పినాడు యేసయ్యా – చక్కనైన మాటలెన్నో
శత్రువును సైతము ప్రేమించమన్నాడు –‖ 2x ‖
నిక్కముగ నిన్ను వలే పక్కవాన్ని సూడమని
ఎక్కడున్న గాని వాడు యేసుకు వారసుడే –‖ 2x ‖
అన్నయ్యా యేసులోకి రావాలయ్యా
అక్కయ్యా యేసులోకి రావాలమ్మా‖ 3x ‖