Verse
మధుర మధురము యేసు నామం‖ 2x ‖
స్తుతికి యోగ్యము ప్రభుని నామం‖ 2x ‖
మధుర మధురము యేసు నామం - మధుర మేసుని నామం
Verse
స్వర్గము వీడి - జగమున కరిగి
సిలువలో రక్తము - చిందించెను
Verse
సిలువపై సైతానును ఓడించి
తొలగించెను నరక శిక్షను
Verse
పాపులకు విమోచన మొసగి
నేర్పుగ తండ్రితో నైక్యము చేసెన్
Verse
రక్తముచే మమ్ము శుద్ధుల జేసెన్
దేవుని పుత్రులుగా మమ్ము మార్చెన్
Verse
ఆత్మలో వారసులుగ మమ్ము జేసెన్
దేవుని మందిరముగ నిర్మించెన్