Intro
సాఖీ: మధురాతి మధురం యేసు నీ నామం... అతి శ్రేష్ఠము యేసు నీ నామం
Chorus
మధురాతి మధురం యేసు నీ నామం
నా అధరముల పలుకులలో నిత్యమూ నిలిచె నీ నామం‖ 2x ‖
Verse
అన్ని నామముల కన్నా పై నామం నీ నామం
మహిమ గల నీ నామం అతి శ్రేష్ఠము, అతి మధురం‖ 2x ‖
అద్భుతాలు చేయు నీ నామం అంధకారమును లయపరుచు నీ నామం‖ 2x ‖
Verse
విన్నపాలకు చెవి యొగ్గును విలాపములను పోగొట్టును
మహిమ గల నీ నామం మహిమకు చేర్చు నీ నామం‖ 2x ‖
మరణపు ముల్లును విరిచెను నీ నామం నిత్య జీవమునిచ్చు నీ నామం‖ 2x ‖