Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Madhuram Amaram Nee Prema Yesu Amrutha Dhaara Na

మధురం అమరం నీ ప్రేమ యేసు అమృత ధార న

Madhuram Amaram Nee Prema Yesu Amrutha Dhaara Na

Chorus
మధురం అమరం నీ ప్రేమ యేసు అమృత ధార నీ కరుణ
అగాధ సముద్రము ఆర్పజాలనిది నదీ ప్రవాహము ముంచి వేయనిది
రక్షణ మార్గం నీ దివ్య వాక్యం పాపికి విడుదల నీ సిలువ
Verse
నిన్ను నేను చేరలేని ఘెరపాపమందుండగా
నన్ను నీలో చేర్చుకొనుటకై నీ రక్తాన్నే కార్చితివే
నీ ప్రేమే మాటే కాదు అది క్రియలతోను నన్ను ఫలియింపజేయుచున్నది
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్ను ఎల్లవేళలలో నేను స్తుతియింతును
Verse
నా యందు నీకు ఉన్న ప్రేమ ఈ లోకాన్ ఉన్న ప్రేమ కన్న
ఈ లోక సౌఖ్యాలకన్న ఎంతో శ్రేష్ఠమైనది
ఆ ప్రియమైన ప్రేమతో జీవింపజేయుచు నన్ను నడిపించుచున్నావయ్యా
నా కీర్తన నా జీవితం నా సర్వము నీకే ఎల్లవేళలలో నేను చెల్లింతును

Related Tags

PraiseWorshipJesus