Verse
మధురం ఈ శుభ సమయం
అతి మధురం వివాహ బంధం‖ 2x ‖
ఆనందమే ఇరువురి హృదయం‖ 2x ‖
జత కలిసె ఈ తరుణంలో‖ 2x ‖
నవ దంపతులకు స్వాగతం‖ మధురం ‖
Verse
ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా మీకుండగా
అబ్రహాము శారా వాలే ఏ క్షణమైనా వీడక‖ 2x ‖
మీ జీవిత సంద్రాన – ఎన్ని కష్టాలు ఎదురైనా‖ 2x ‖
ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి‖ మధురం ‖
Verse
ప్రేమకు ప్రతి రూపమే మీ పరిణయము
మనసులో వెలియగ మమతలు విరబూయగా‖ 2x ‖
అనురాగ పూవులే మీ ఇంట పూయగా‖ 2x ‖
మీ దాంపత్యం అందరికి కలకాలం నిలవాలి‖ మధురం ‖