Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Madhuram Madhuram Daiva Vaakyam

మధురం మధురం దైవ వాక్యం

Madhuram Madhuram Daiva Vaakyam

Verse
మధురం మధురం దైవ వాక్యం
తేనెకన్న మధురం దేవుని వాక్యం
చీకటి నిండిన వీదులలో
కాంతిని వెదజల్లు దైవవాక్యం
Pre-Chorus
జీవమున్న వాక్యం,జీవమిచ్చు వాక్యం
దేవుని దివ్య వాక్యం...
Verse
ఖడ్గము కంటెను వాడిగలది
ప్రాణాత్మలను విభజించెడి వాక్యం
హృదయమునందలి చింతలను
పరిశోదించెడి దైవ వాక్యం‖ జీవమున్న ‖
Verse
నాహృదయములో దైవ వాక్యం
పదిలపరచుకొని యున్నందున
పాపములో...నే తడబడకుండ
అడుగులు కాపాడు దైవ వాక్యం‖ జీవమున్న ‖
Verse
కష్టములలోన దైవవాక్యం
నెమ్మది నిచ్చి నడిపించును
అలసిన,కృంగిన వేళలలో
జీవింపచేయు దైవ వాక్యం‖ జీవమున్న ‖

Related Tags

PraiseBibleWord Of God