Chorus
మధురం మధురం మధురం యేసునాధ కథ మధురం‖ మన ‖
Verse
మధురమే మన ప్రభు యేసుని నామం మానవాళికదే
మాధుర్యమనామం పాపిని బ్రోచెడి పావన నామం పరమున జేర్చే
పరిశుద్ధనామం‖ మన ‖
Verse
మారని దేవుని మాటయే మధురం మదిలోదలచిన కలతను
దీర్చున్ ఎదలో బాధను బాపున్ నిరతం నమ్మిననరులకు
నెమ్మది నిచ్చున్‖ మ ‖
Verse
పగలురేయి ప్రార్థించుటే మధురం పరిశుద్ధుల సహవాసమే
మధురం అపోస్తలుల సద్భోదయే మదురం మధురాతి
మధురం పరిశుద్ధ రుధిరం‖ మ ‖
Verse
జుంటితేనెయ ధారలకంటే కమ్మనిది ప్రభు క్రీస్తుని
వార్యం ఆదియందు ఆ వాక్యమే ఉండెన్ వాక్యమే
ప్రియప్రభు యేసుగ మారెన్‖ మ ‖
Verse
అందరిలో అతిసుందరుడతడు ఆది దేవుని ఏకైక సుతుడు
ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త అవతరించె భువిన్ అందరి కొరకే‖ మ ‖
Verse
యేసే క్రీస్తుగ నెరిగిన మేము పరుగిడితిమి పాపము నుండి
దూరం పొందితిమి ఆత్మానందభాగ్యం ప్రకటించుటే
మా ప్రధానధ్యేయం‖ మ ‖