Chorus
మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం
శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం‖ 2x ‖
దీన మనస్సు – దయ గల మాటలు
సుందర వదనం – తేజోమయుని రాజసం‖ 2x ‖
Verse
ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని
బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు‖ 2x ‖
నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి‖ 2x Madhuram ‖
Verse
పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు
ప్రయాసపడు వారి భారము తొలగించుటకు‖ 2x ‖
ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి‖ 2x Madhuram ‖
Verse
కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను
ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా‖ 2x ‖
జడియకు నీవు మహిమలో నిలుపుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి‖ 2x Madhuram ‖