Verse
మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెద
సుధలు నిండు ఆ నామమును భువిని నేను చాటెద
Verse
ఎంత ఘోర పాపులనైన మార్చివేయును
ఎంత కఠిన హృదయములైనా కరిగి పోవును
యేసు కరుణ వాక్కులే ప్రేమపూరితం
Verse
ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమ
ఎంచిచూడ ఏదిలేదు మంచితనము నాలో
యేసు రక్త ధారలే క్షమా సహితము
Verse
కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం
హింసయైన బాధయైన లేదు యే భయం
యేసు మథుర నామమే రక్షణ కారణం