Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Madhuramainadi

మధురమైనది

Madhuramainadi

Verse
మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ‖ 2x ‖
మరువలేనిది నా యేసుని ప్రేమ‖ 2x ‖
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ
Chorus
ప్రేమా… ప్రేమా…
ప్రేమా… నా యేసు ప్రేమా‖ 2x మధురమైనది ‖
Verse
ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని
నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని‖ 2x ‖
చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి‖ 2x ‖
నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం‖ ప్రేమా ‖
Verse
పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినా
ఎగసి పడే అలలతో కడలే గర్జించినా‖ 2x ‖
మరణపు ఛాయలే దరి చేరనీయక‖ 2x ‖
కౌగిట దాచిన నీ ప్రేమ మధురం‖ ప్రేమా ‖
Verse
నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి‖ 2x ‖
మరణపు ముల్లును విరచిన దేవా‖ 2x ‖
జీవము నొసగిన నీ ప్రేమ మధురం‖ ప్రేమా ‖

Related Tags

PraiseWorshipJesus Love