Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Madhyapaana Priyulu Gaakundi Priya

మద్యపాన ప్రియులు గాకుండి ప్రియ

Madhyapaana Priyulu Gaakundi Priya

Lyricist: Nelaturi Lookar
Verse
మద్యపాన ప్రియులు గాకుండి ప్రియులార మీరా మత్తులోనే మునిఁగి
పోకుండి మద్యపానము చేయువారికిఁ దథ్యముగఁ బ్రాప్తించుఁ గీడులు
కొద్దియైనన్ రుచిని జూడఁగఁ గోరఁ దగ దని తలఁచుకొనుఁడి‖ మద్య ‖
Verse
రక్త మంతయుఁ జెడును సుమ్మండి ప్రియులారా మీరు శక్తిహీనులగుదు
రిల నుండి శక్యిహీనులె గాక మఱి మీ భక్తి దొలఁగి పోవునండి
ముక్తిమార్గము దెలియదండి ముందు గతికి హీనమండి‖ మద్య ‖
Verse
బుద్ధిబలములు కొద్ది వౌనండి ప్రియులారా మీరు మొద్దు లగుదురనియు
నమ్ముండి హద్దు మిరుచుఁ ద్రాగువారికిఁ గొద్దికాలమె జీవమండి
శ్రద్ధగల్గి మద్యపానము రద్దు చేయుట తగినదండి‖ మద్య ‖
Verse
మచ్చునకును త్రాగఁబోకుండి ప్రియులార మీరీ తుచ్ఛమైన పనులు
వీడుండీ హెచ్చుగాఁ దిని త్రాగువారికి వచ్చు రోగము కుదురదండి
చచ్చుటకు నిది హేతువని మదిఁ గచ్చితముగను దెలిసికొనుఁడి‖ మద్య ‖
Verse
ఆలుబిడ్డల మేలుఁగోరుండి ప్రియులారా వారి మేలుఁ గోరినఁ ద్రాగంఁ
బోకుండి మేలు లెఱింగి పిలుచు క్రీస్తుని జాలిచూపులు దెలిసికొనుఁడి
కాలయాపనఁ జేయకుండి కర్త యేసని నమ్ముకొనఁడి‖ మద్య ‖
Verse
ఘన ధనములు నిలువఁబోవండి ప్రియులార నీచ తనము మీకు
మూల మౌనండి తనవిఁదీర్చుదు మద్యమండి ఘనుల కొంపలు గూల్చు
నండి ఘనముగాఁ బ్రభువాక్యసారము వినయమతితో ఁ గ్రోలరండి‖ మద్య ‖

Related Tags

WarningTemperanceSobriety