Verse
మేఘంబుపై నెక్కి మేలుగ ప్రభు క్రీస్తు యాకసంబున కేగెను
ప్రాకటముగను ఆత్మనంది ప్రజ్ఞ మీరగ సాక్ష్యమిచ్చి యేక దీక్షను యేసు
రాకకు నెదురు జూడుడటంచు ప్రభువు‖ మేఘంబు ‖
Verse
యూదయ్య సమరయ్య ప్రాంతంబులంతట నాదు వార్తను జాటరే
భూదిగంతము వరకు మీరు భూరి సాక్షులగుచు నాకు సాదరంబుగ సత్య
విశ్వా సంబులన్ మనుడంచు ప్రభువు‖ మేఘంబు ‖
Verse
గలిలయ్యులార మీ రాశతో నెందుకు తిలకించు చున్నారట్లు
వెలయపరమున కెట్లు నేగెనొ యిలకు నా ప్రభువట్లెమరల యలర వచ్చుట
మీరు గాంచెద రంచు దూతలు బల్కిరపుడె‖ మేఘంబు ‖
Verse
శ్రీ సంఘ మిదివిను మా యేసు ప్రభు క్రీస్తే భాసిల్ల మఱి వచ్చును
యేసు ప్రభుని యడుగు జాడల యేపు మీరగ నడచు కొనుచు నీసు
రక్షణ నిలకుజాటుచు నెదురు జూడుము యేసు కొఱకే‖ మేఘంబు ‖