Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maelkonumaa Maelkonumaa Naa Praanamaa

మేల్కొనుమా మేల్కొనుమా నా ప్రాణమా

Maelkonumaa Maelkonumaa Naa Praanamaa

Chorus
మేల్కొనుమా, మేల్కొనుమా నా ప్రాణమా
యోచించుమా, మాటవినుమా పొందెదవు సర్వమున్
Verse
యేసు పాదముల యొద్దకురా యేసు కర్పించు నీజీవితము
నీ విపుడే (2) యెరుగు దీనిన్ - జ్ఞానము పొందెదవు‖ 2x ‖
Verse
జీవాహారము భుజించుమిపుదే జీవితమందు శక్తిని పొందు
నీ విపుడే (2) యెరుగు దీనిన్ - జయమును పొందెదవు‖ 2x ‖
Verse
సర్వమున్ ప్రభువుతో నారంభించి - సర్వమున్ ముగించు మాయనతో
నీ విపుడే (2) యెరుగు దీనిన్ - ప్రభువే గొప్పవాడని‖ 2x ‖
Verse
ఎవ్వరు ప్రభుసేవ చేసేదరో - ఎవ్వరాయనతో నడిచెదరో
నీ విపుడే (2) యెరుగు దీనిన్ - పొందెదరు జీతమున్‖ 2x ‖
Verse
తుఫాను మధ్య నీవుండినను - ధైర్యముగ నీవు నడువవలెన్
నీ విపుడే (2) యెరుగు దీనిన్ - విశ్రాంతి పొందెదవు‖ 2x ‖
Verse
నిద్రించి పొందకపోయి రేమియున్ - కలిగినదాని పోగొట్టుకొనిరి
నీ విపుడే (2) యెరుగు దీనిన్ - లేచి పొందు ఘనత‖ 2x ‖
Verse
అంతము వరకు స్థిరముగ నుండిన - పొందెదవు ప్రభువిచ్చు ఘనత
నీ విపుడే (2) పొందెదవు - జీవకిరీటమును‖ 2x ‖

Related Tags

DevotionSpiritual LifeAwakening