Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maelukoni yika laechi yaesuni maelula

మేలుకొని యిక లేచి యేసుని మేలుల

Maelukoni yika laechi yaesuni maelula

Lyricist: Chetti Bhanumurthy
Chorus
మేలుకొని యిక లేచి యేసుని మేలులన్ వేనోళ్ల బాడరే బాలబాలికలారా
చాలా పాడరే వేలపాడరే‖ మేలు ‖
Verse
పక్షి గణములు కూడి దేవుని ప్రేమ నెల్లను పొగడుచున్నవి బాపహరుడగు
క్రీస్తు చెంతకు పారుమా రక్షణ కోరుమా‖ మేలు ‖
Verse
అరుణరాగము వెల్లి విరిసెను ఆకసంబున జుక్కలణగెను తరుణ
ముననే లేచి దేవుని కెఱగుమా దీవెన కరుగుమా‖ మేలు ‖
Verse
తెల్లవారెను లోకమెల్లను తెలివిగొని మున్ముందు దేవుని తల్లి దండ్రియు
గురుడవీవని దలచుచూ తగధ్యానించుమా‖ మేలు ‖
Verse
జగములెల్లను జంతుజాలము ల గణితంబగు జీవులెల్లను సొగసున
న్వేనోళ్ల బొగడుట జూడుమా నీవును పాడుమా‖ మేలు ‖
Verse
నీతి భాస్కరుడుదయమాయెను నూతనోజ్జీవన మొసంగను సతత మాతని
దాపున న్వసియించుమా తగ జీవించుమా‖ మేలు ‖

Related Tags

WorshipMorningChildren