Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maha Samarthya O Yesu Bahu Vishalaudavu Neevu

మహా సామర్థ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు

Maha Samarthya O Yesu Bahu Vishalaudavu Neevu

Verse
మహా సామర్థ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు
ప్రేమపూర్ణుడా నిన్ను మనస్సార స్తుతించెదను
Verse
ప్రభు నీవే నాదు జీవము నేను పూర్తిగా మృతుడను
దాచబడితిని నీయందు స్థిరపరచితివి నన్ను
ప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను
Verse
సర్వశ్రేష్టుండా ప్రభువా సర్వ ప్రదానుండవు నీవే
నీదు చిత్తం నెరవేర్చుకో నీదు ప్రభుత్వమందున్నాను
నీవే శిరోమణివి ప్రభో ఆర్భాటించి స్తుతించెదను
Verse
నాయందున్న ప్రభువా నీవే శుభ నిరీక్షణయైతివి
వేగ వచ్చుచున్నావని నా ఆశ అధికంబగుచుండె
సంధింతు ప్రభు నిన్ను మహా సంతోషస్తుతుల నర్పించి
Verse
ప్రభు నీవే విజయుండవు మరణమున్ జయించితివి
సర్వశక్తి అధికారంబుల్ నీదు వశమందున్నవి
నిన్నుబట్టి జయించెదను దీనుడనై భజించెదను

Related Tags

PraiseWorshipJesus