Verse
మహా దేవుండు పరిశుద్ధుడగు తనయుని
అర్పించెను నీపై మక్కువతో వందన మర్పించుము
Verse
పైనున్న వాటినే వెంటాడుచు - ఇహలోక సంగతులు గమనించక
క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై
పై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము
Verse
నీ జీవము క్రీస్తుతో కూడను - దేవునిలో దాచబడియున్నది
క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై
పై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము
Verse
లోకాన నరబేధము పాటింపక - పరలోక దేవుని సేవించుము
క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై
పై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము
Verse
సంగీతనాదముతో ప్రభు క్రీస్తుకు - హల్లెలూయ స్తుతులర్పించుము
సమస్తమాయన పేరట చేయుచు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు - వందనమర్పించుము