Verse
మహా వైద్యుండు వచ్చెను
ప్రజాళిఁ బ్రోచు యేసు
సహాయ మియ్య వచ్చెను
సంధింపరండి యేసున్
మాధుర్యంపు నామము‖ మాధుర్యంపు నామము ‖
మోద మిచ్చు గానము
వేద వాక్యసారము
యేసు దివ్య యేసు
Verse
మీ పాప మెల్లఁ బోయెను
మేలొందుఁ డేసు పేరన్
గృపా సంపూర్ణ మొందుఁడి
యపార శాంతుఁ డేసు.
Verse
వినుండి గొఱ్ఱె పిల్లను
విశ్వాస ముంచి యేసున్
ఘనంబుగన్ స్తుతించుఁడి
మనం బుప్పొంగ యేసున్
Verse
ఆ రమ్యమైన నామము
అణంచు నెల్ల భీతిన్
శరణ్యు లైన వారి నా
దరించు నెంతో ప్రీతిన్
Verse
ఓ యన్నలారా పాడుఁడీ
యౌదార్యతన్ సర్వేశున్
ఓ యమ్మలారా మ్రొక్కుఁడీ
ప్రియాతి ప్రియుఁడేసు
Verse
ఓ పిల్లలారా కొల్వుఁడీ
యౌన్నత్య రాజు నేనున్
తపించువారి దాతయౌ
దయామయున్ శ్రీ యేసున్
Verse
శ్రీ యేసుకై యర్పించుఁడీ
మీ యావజ్జీవనమును
ప్రియంపు దాసులౌచును
రయంబు గొల్వుఁడేసున్