Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahadevuda Mahonnathuda Mahaghanuda

మహాదేవుడా మహోన్నతుడా మహాఘనుడా

Mahadevuda Mahonnathuda Mahaghanuda

Lyricist: Dr Negala Joshua
Verse 1
మహాదేవుడా మహోన్నతుడా మహాఘనుడా మా పరిశుద్ధుడా యుగయుగములకు దేవుడవు తరతరములకు నీవే మా ప్రభుడవు స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా స్తుతులందుకో నా యేసయ్య
ఆరాధన నీకే యేసయ్య
స్తుతి అర్పణ నీకే మెస్సయ్య
యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా షాలోమ్ యెహోవా రాఫా
Verse
ఆకాశం నీ సింహాసనం
భూమిని పాదపీఠం
అడవి మృగములు ఆకాశ పక్షులు
సముద్ర మస్థ్యములు నీ నిర్మాణములు
మంటితో నరుని నిర్మించినావు నీ పోలికలో సృజించినావు
నీ స్వాస్థ్యమునే మాకిచ్చినావు నీ వారసునిగా మమ్ము పిలిచినావు‖ యెహోవా ‖
Verse
పరిశుద్ధుడు పరిశుద్ధుడని
సెరాపులు నిన్ను స్తుతించగా
సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి మహిమ ఘనత
పరలోకమే నీ మహిమతో నిండెను భూజనులకు సమాధానం కల్గెను సైన్యములకు అధిపతియగు నీవు సర్వ సృష్టిలో పూజ్యుడనీవు‖ యెహోవా ‖

Related Tags

PraiseWorship