Verse
మహదానందమైన నీదు సన్నిధి
ఆపత్కాలమందు దాగుచోటది
మనవులు అన్నియు ఆలకించిన
వినయముగలవారికి ఘనతనిచ్చిన
Verse
నీ సింహాసనమును స్థాపించుటకు
నీవు కోరుకున్న సన్నిధానము
ఎంత మధురము నీ ప్రేమ మందిరం
పరవశమే నాకు యేసయ్య
Verse
విసిగిన హృదయం కలవరమొంది
వినయము కలిగి నిన్ను చేరగ
పరమందుండి నీవు కరుణచూపగా
లేత చిగురుపైన మంచు కురియు రీతిగా
Verse
ప్రేమను చూపి బాహువు చాపి
నీలో నన్ను లీనము చేసిన
ప్రేమసాగరా జీవితాంతము
నీ సన్నిధిని కాచుకొందును
Verse
లెక్కించలేని స్తుతులతో నీవు
శాశ్వతకాలము స్తుతినొందెదవు
మహిమతో నీవు సంచరించగా
ఏడు దీపస్థంబములకు వెలుగు కలుగగా
Verse
ఉన్నతమైన ప్రత్యక్షతను
నే చూచుటకు కృపనిచ్చితివి
కృపాసాగరా వధువు సంఘమై
నీకోసమే వేచియుందును
Verse
సీయోను శిఖరమే నీ సింహాసనం
శుద్ధులు నివసించు మహిమ నగరం
ఎవరు పాడలేని క్రొత్త కీర్తన
మధురముగా నీయెదుట నేను పాడెద
Verse
సౌందర్యముగా అలంకరించిన
నగరములోనే నివసించెదను
ప్రేమపూర్ణుడా మహిమాన్వితుడా
నీతోనే రాజ్యమేలెదా