Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahaghanudavu Mahonnathudavu

మహాఘనుడవు మహోన్నతుడవు

Mahaghanudavu Mahonnathudavu

Lyricist: Hosanna Ministries
Verse
మహాఘనుడవు మహోన్నతుడవు
పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు‖ 2x ‖
కృపా సత్య సంపూర్ణమై
మా మధ్యలో నివసించుట న్యాయమా
నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా‖ 2x ‖
Verse
వినయముగల వారిని
తగిన సమయములో హెచ్చించువాడవని‖ 2x ‖
నీవు వాడు పాత్రనై నేనుండుటకై
నిలిచియుందును పవిత్రతతో‖ 2x ‖
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా‖ 2x మహా ‖
Verse
దీన మనస్సు గలవారికే
సమృద్ధిగా కృపను దయచేయువాడవని‖ 2x ‖
నీ సముఖములో సజీవ సాక్షినై
కాపాడుకొందును మెళకువతో‖ 2x ‖
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా‖ 2x మహా ‖
Verse
శోధింపబడు వారికి
మార్గము చూపించి తప్పించువాడవని‖ 2x ‖
నా సిలువ మోయుచు నీ సిలువ నీడను
విశ్రమింతును అంతము వరకు‖ 2x ‖
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా‖ 2x మహా ‖

Related Tags

PraiseWorshipHoliness