Chorus
మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్యనివాసి
మా సాఅమర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణనిధి
Verse
ఉన్నత పరిశుద్ధ స్థలములలో
నివసించువాడు పరిశుద్ధుడు
అయినను - నలిగిన వినయంపు
దీనమనస్సులో నివసించును జీవించును
Verse
దినమెల్ల ప్రభుకై వధియింప
బడి యున్నట్టి గొర్రెలము
అయినను - ప్రేమించినవాని
ప్రేమను బట్టియే పొందితిమి విజయమును
Verse
మోసము శిక్షయు దుఃఖమును
దరిద్రత కలిగియున్నాము
అయినను - సత్యము జీవము
సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి
Verse
పడిపోయి మేముంటిమి
అంధకారమందుంటిమిగా
అయినను - తిరిగి లేతుము
యెహోవాయే మా వెలుగు మా రక్షణ
Verse
మన క్రీస్తును బట్టి యెల్లప్పుడు
నిందకు పాత్రులమైతిమి
అయినను - ఎల్లప్పుడు వూరేగించును
మమ్ము విజయముతో స్తోత్రములు