Verse 1
Reference: నీవే మహిమ ప్రభావములు పొందనర్హుడవు ప్రకటన Revelation 4:11
Chorus
మహారాజా యేసు నీకే మహిమ కలుగు గాక
Pre-Chorus
ఘనత ప్రభావము నీదే నిత్యరాజ్యము నీదే
Verse
కన్యగర్భమున జన్మించ సంకల్పించుకొన్నావే
పాపమెల్ల నాశము చేయ పాపి రూపము దాల్చితివే
Verse
సిలువశ్రమలను సహించి మరణము రుచించితివే
ప్రాణము పెట్టి మము రక్షించి తండ్రిని తృప్తిపరచితివే
Verse
పాప మరణ నరకమునుండి రక్షింప సంకల్పించి
త్రియేక దేవునితో జేర్చ చెడుగు తీసి వేసితివే
Verse
పాపీ దేవునిచే మారు మనస్సును పొందుమా
ఆత్మానుగ్రహ కాలమున వచ్చి రక్షణ పొందుమా