Verse
మహాత్ముఁడైన నా ప్రభు
విచిత్ర సిల్వఁ జూడ నా
యాస్తిన్ నష్టంబుగా నెంచి
గర్వం బణంగఁ ద్రొక్కుదున్
Verse
నీ సిల్వ గాక యో దేవా
దేనిన్ బ్రేమింప నీయకు
నన్నాహరించు సర్వమున్
నీ సిల్వకై త్యజింతును
Verse
శిరంబు పాద హస్తముల్
నూచించు దుఃఖ ప్రేమలు
మరెన్నడైన గూడెనా
విషాదప్రేమ లీ గతిన్
Verse
ముండ్లన్ దుర్మార్గులల్లిన
కిరీట మేసు కుండినన్
ఈ భూకిరీటములన్నీ
దానం దూగంగఁ జాలు నే
Verse
లోకంబు నే నర్పించిన
నయోగ్యమైన యీవి యౌ
వింతైన యేసు ప్రేమకై
నా యావజ్జీవ మిత్తును
Verse
రక్షింపఁ బడ్డ లోకమా
రక్షింపఁ జావుఁ బొందిన
రక్షకుఁ డేసునిన్ సదా
రావంబుతోడఁ గొల్వుమా