Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahathmudaina Naa Prabhu Vichithra Silvajooda Naa

మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వజూడ నా

Mahathmudaina Naa Prabhu Vichithra Silvajooda Naa

Verse
మహాత్ముడైన నా ప్రభు - విచిత్ర సిల్వజూడ నా
ఆస్తిన్ నష్టంబుగా నెంచి - గర్వంబణంగ ద్రొక్కుదున్
Verse
నీ సిల్వగాక యోదేవా - దేనిన్ బ్రేమింపనీయకు
నన్నావరించు సర్వమున్ - నీ సిల్వకై త్యజింతును
Verse
శిరంబు పాదహస్తమున్ - సూచించి దుఃఖ ప్రేమలు
మరెన్నడైన గూడెనా - విషాద ప్రేమలీగతిన్
Verse
ముండ్లన్ దుర్మార్గులల్లిన - కిరీట మేసు కుండినన్
ఈ భూకిరీటములన్ని - దానిన్ దూరంగ జాలునే
Verse
లోకంబు నే నర్పించినన్ - అయోగ్యమైన యీవియౌ
వింతైన యేసు ప్రేమకై - నా యావజ్జీవమిత్తును
Verse
రక్షింపబడ్డ లోకమా - రక్షింప చావు పొందిన
రక్షకుడేసును సదా - రావంబు తోడ గొల్వుమా

Related Tags

CrossGood FridaySacrifice