Verse
మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు
మహితోటలో నరమొక్కలు నాటించాడు
తన పుత్రుని రక్త నీరు తడికట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు
కాయవే తోట కమ్మని కాయలు
పండవే చెట్టా తియ్యని ఫలములు
Verse
నీతిపోత జాపికాపు ఆత్మశుద్ధ ఫలములు
నీతండ్రి నిలువ చేయు నిత్యజీవ నిధులు
అనంతమైన ఆత్మపొందు అమర సుఖశాంతులు
అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు
Verse
అపవాది వెంటబడ కుంటుపడిపోకుము
కాపు పట్టి చేదు పళ్ళు గంపలుగా కాయకు
వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు
అదిగో గొడ్డలి వేరున పదును పెట్టియున్నది