Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahima Ghanatha Sthuthi Prabhavamu Neeke Kalugunu Gaaka

మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక

Mahima Ghanatha Sthuthi Prabhavamu Neeke Kalugunu Gaaka

Chorus
మహిమ, ఘనత, స్తుతి ప్రభావము - నీకే కలుగును గాక ఆ. ఆ.
నీకే కలుగును గాక మా దేవా - నీకే కలుగును గాక !
Verse
బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు - నీ దానములే జ్ఞాన స్వరూపి‖ 2x ‖
జగమును సౄష్టించి - నిర్వహించు వాడవు‖ 2x ‖
నీ జ్ఞానమును - వివరింపతరమా‖ 2x ‖
నీ జ్ఞానముతో నింపు మమ్ము మాదేవా - నీ జ్ఞానముతో నింపు మమ్ము
Verse
వెండి బంగారు అష్టైశ్వర్యములు - నీ దానములే శ్రీ మంతుడా
శ్రేష్ఠ ఈవులనిచ్చు - జ్యోతీర్మయుడవు
నీ మహిమైశ్వర్యం - వివరింపతరమా
నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా - నీ మహిమైశ్వర్యమిమ్ము
Verse
అధిక బలము సంపూర్ణ శక్తి - నీ దానములే యుద్దశూరుడా
నీ కసాద్యమైనది లేదే యెహోవా
నీ సర్వశక్తిని - వివరింపతరమా
నీ సర్వశక్తితో నింపు మా దేవా - నీ సర్వశక్తితో నింపు
Verse
శాశ్వతమైనది నీ మధుర ప్రేమ - జ్ఞానమునకు మించు ప్రేమాస్వరూపీ
కొలువగలేము నీ - ఘనప్రేమను
సాటిలేని నీ ప్రేమన్ వివరింపతరమా
నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా - నీ ప్రేమతో నింపు మమ్ము
Verse
ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని - అగాధ సముద్రముల్ జ్వాలామయుడా
మరణమంత బలమైన - నీ ప్రేమ ధాటిని
అగపె ప్రేమను - వివరింప తరమా
అగపే ప్రేమతో నింపు మా దేవా - అగపే ప్రేమతో నింపు

Related Tags

PraiseWorshipGlory