Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahima Mahima Mahima Yanuchu Shishuvulu

మహిమ మహిమ మహిమ యనుచు శిశువులు

Mahima Mahima Mahima Yanuchu Shishuvulu

Lyricist: William Berry
Chorus
మహిమ మహిమ మహిమ యనుచు శిశువులు నిర్మల వినోద
ధ్వనులు నిలుతురు అహమ మా యఘంబు లెల్ల నణ(చె వీని నామమనుచు
బహు విధంబులైన పాట ల్బాడుచు నాడుచు వేఁడుచు గూడుచు‖ మహిమ ‖
Verse
శత సహస్ర సంఖ్య మించి బాల సం చయము ప్రభుని గద్దె చుట్టున
నతులితంబు లైన కాంతి గతుల నమర మింటఁ బాడ నీతీరు నెవరు
దెచ్చి రచటి కేగతిఁ దాఁగూడి మ్రోగఁగ సాగిరి‖ మహిమ ‖
Verse
వింతయైన మతులు జేయఁగా నెవఁడు తనదు విలువలేని నల్లఁ
జల్లగ సమసెనో యఘంబు లట్టి జనకుఁడైన ప్రభువు నెదుట నమల
కోమలంబులైన యాటలఁ బాటల మీటుచుఁ జాటుచు‖ మహిమ ‖
Verse
తాము ప్రభుని కృపను మిగులను జూచి యతని దయను లోక మందు
వేడ్కను బ్రేమఁజెంది యిపుడు గొఱ్ఱె పిల్లయైన ప్రభువు నెదుట దాము
మోద మలర నిలిచి వేమరు దామెల్ల నా మోముఁ బ్రేమించి‖ మహిమ ‖

Related Tags

PraiseWorshipChildren