Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahima Neeke Ghanatha Neeke

మహిమ నీకే ఘనత నీకే

Mahima Neeke Ghanatha Neeke

Lyricist: Ravinder Vottepu
Verse
మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా‖ 2x ‖
న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన‖ 2x ‖
ధనవంతులను అణచేవాడవు
జ్ఞానులను సిగ్గుపరచువాడవు‖ 2x ‖
దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు‖ 2x ‖
యుద్ధవీరుడా శూరుడా
లోకాన్ని గెలిచిన యేసయ్యా‖ 2x ‖
Verse
మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు
నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు‖ దరిద్రులను ‖
Verse
గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు
నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు‖ దరిద్రులను ‖

Related Tags

PraiseWorshipJesus