Verse
మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ‖ 2x ‖
స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ‖ 2x ‖
ఆరాధనా… ఆరాధనా…‖ 2x ‖
ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే‖ మహిమ ‖
Verse
సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే‖ 2x ఆరాధనా ‖
Verse
ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే‖ 2x ఆరాధనా ‖
Verse
ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే‖ 2x ఆరాధనా ‖