Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahima Sarvoannathamaina Dhaivamunaki Mma

మహిమ సర్వోన్నతమైన దైవమునకి మ్మ

Mahima Sarvoannathamaina Dhaivamunaki Mma

Lyricist: Bethala John
Chorus
మహిమ సర్వోన్నతమైన దైవమునకి మ్మహి సమాధానానుగ్రహము గల్గున్ర్పభో‖ మహిమ ‖
Verse
నిన్ను స్తోత్రించుచు నిన్ను బూజించుచు
నిన్ను మహిమపర్చుచున్నాము లోక ప్రభో‖ మహిమ ‖
Verse
ప్రభువైన దేవుండా పరమండలపు రాజా ప్రబలంబు గల తండ్రి
పరిశుద్ధంబగు ప్రభో‖ మహిమ ‖
Verse
వినయంబుతో నీదు ఘన మహిమార్థంబై వందనములర్పించి
వినుతింతుము సత్ర్వభో‖ మహిమ ‖
Verse
జనితైక పుత్రుడగు ఘన క్రీస్తేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల
జనకుని కుమారుడ ప్రభో‖ మహిమ ‖
Verse
ధర పాపములమోయు వరపుణ్య శీలుండా కరుణించి మా
బీద మొరలాలించుము ప్రభో‖ మహిమ ‖
Verse
తండ్రియైన దేవుని దక్షిణ్ భాగమున గూర్చుండి యున్నావు
కృపజూపుమి సత్ర్పభో‖ మహిమ ‖
Verse
పరిశుద్ధుడవు నీవే పరమ ప్రభుడవు నీవే
దురితాత్ములను గాన మరణంబైతివి ప్రభో‖ మహిమ ‖
Verse
పరమ జనకుని మహిమన్ పరిశుద్దాత్మైక్యంబై
సరణి మాకై యున్న సర్వోన్నత ప్రభో‖ మహిమ ‖

Related Tags

PraiseWorshipGlory