Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahima Swaroopuda Mrutyunjayuda

మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా

Mahima Swaroopuda Mrutyunjayuda

Chorus
మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా
మరణపుముల్లును విరిచినవాడా
నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు
Verse
నీ రక్తమును నా రక్షణకై
బలియాగముగా అర్పించినావు
నీ గాయములద్వారా స్వస్థతనొంది
అనందించెద నీలో నేను‖ మహిమ స్వరూపుడా ‖
Verse
విరిగిన మనస్సు నలిగినా హృదయం
నీ కిష్టమైన బలియాగముగా
నీ చేతితోనే విరిచిన రోట్టెనై
ఆహారమౌదును అనేకులకు‖ మహిమ స్వరూపుడా ‖
Verse
పరిశుద్ధత్మ ఫలముపొంది
పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై
సీయోను రాజా నీ ముఖము చూడ
ఆశతో నేను వేచియున్నాను‖ మహిమ స్వరూపుడా ‖

Related Tags

PraiseWorshipResurrection