Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahimaanvithamu

మహిమాన్వితము

Mahimaanvithamu

Lyricist: Adam Benny
Verse
మహిమాన్వితము మనోహరము
నీ దివ్య సన్నిధానము‖ 2x ‖
నిన్నే కోరానయ్య – నిన్నే చేరానయ్య
నీవే కావాలని యేసయ్య‖ 2x మహిమాన్వితము ‖
Verse
కోరలేదు ధన సంపద
కోరినాను నిను మాత్రమే‖ 2x ‖
ఐశ్వర్యము కంటే అధికుడవు‖ 2x ‖
నీ ఆశ్రయమే చాలునయా‖ 2x నిన్నే ‖
Verse
జీవపు ఊటలు కల చోటికి
జీవ నదులు పారే చోటికి‖ 2x ‖
ప్రేమతో పిలచిన నా యేసయ్యా‖ 2x ‖
నా దాహమును తీర్చెదవు‖ 2x నిన్నే ‖
Verse
తేజోనివాసుల నివాసము
చేరాలనునదే నా ఆశయ్యా‖ 2x ‖
యుగయుగములు నే నీతో ఉండి‖ 2x ‖
నిత్యారాధన చేయాలని‖ 2x నిన్నే ‖

Related Tags

PraiseWorship