Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahimagala Thandri Manchi

మహిమగల తండ్రి మంచి

Mahimagala Thandri Manchi

Verse
మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు
మహితోటలో నర మొక్కలు నాటించాడు‖ 2x ‖
తన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను – కాపుగా వుంచాడు‖ 2x ‖
కాయవే తోటా – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు‖ 2x మహిమ ‖
Verse
నీతి పూత జాతి కర్త – ఆత్మ సుతా ఫలములు
నీ తండ్రి నిలువచేయు – నిత్య జీవ ఫలములు‖ 2x ‖
అనంతమైన ఆత్మ బంధ – అమర సుధా కాంతులు‖ 2x ‖
అనుకూల సమయమయ్యె – పూయు పరమ పూతలు‖ 2x కాయవే ‖
Verse
అపవాది కంటబడి – కుంటుబడి పోకు
కాపుకొచ్చి చేదు పండ్లు – గంపలుగా కాయకు‖ 2x ‖
అదిగో గొడ్డలి వేరు – పదును పెట్టియున్నది‖ 2x ‖
వెర్రిగా చుక్కలనంటి – ఎదిగి విర్రవీగకు‖ 2x కాయవే ‖
Verse
కలువరి కొండలో పుట్టి – పారిన కరుణా నిధి
కలుషమైన చీడ పీడ – కడిగిన ప్రేమానిధి‖ 2x ‖
నిజముగాను నీవు – నీ సొత్తు కావు‖ 2x ‖
యజమాని వస్తాడు – ఏమి ఫలములిస్తావు‖ 2x కాయవే ‖
Verse
ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు
మోదమెంతో ఉంచాడు – మోడుబారి పోకు‖ 2x ‖
ముండ్ల పొదలలో కృంగి – మెత్తబడి పోకు‖ 2x ‖
పండ్లు కోయ వచ్చువాడు – అగ్నివేసి పోతాడు‖ 2x కాయవే ‖

Related Tags

PraiseSpiritual GrowthGod The Father