Verse
మహిమకు పాత్రుడవు ఘనతకు అర్హుడవు
నిను నే కీర్తించి స్తోత్రించెదను
ఘనపరచెదను
Verse
నా యేసయ్య నీకేనయ్యా ఆరాధనా
నా దైవమా నా సర్వమా నీకే ఆరాధన
Chorus
ఆరాధన ఆ..ఆ.. నీకే ఆరాధన
నీకే ఆరాధన నీకే యేసయ్య
Verse
పేరు పెట్టి పిలచినావు నీ సొత్తుగా చేసినావు
బలపరిచే ఆత్మసాక్షిగా మార్చినావయ్యా…
Verse
నీ ప్రేమకు ఏమిచెదనయ్యా నా యేసయ్య
నీ ప్రేమకు సాటిలేరెవ్వరు నా యేసయ్య
నీ ప్రేమే రక్షణాధారము నా యేసయ్య
నా జీవితం అర్పించెదనయ్య
Verse
రాజులకు రాజు నీవు ప్రభులకు ప్రభు నీవు
రాజ్యములని ఏలుచున్న మహా రాజువు నీవయ్యా
Verse
మా స్తుతులకు కారణభూతుడవు మా యేసయ్య
మా ఆరాధనా నీకేనయ్యా మా యేసయ్య
నీ నామం ఘనపరచెదనయ్య మా యేసయ్య
నీ మహిమను చాటుదాం మా యేసయ్య