Verse
మహిమతో నిండిన మా రాజా - మహిమతో తిరిగి వచ్చువాడా
శరీరమును దాని క్రియలెల్లను
ఆశతో వాక్యముచే తొలగించుము - వచ్చి తొలగించుము‖ 2x ‖
Verse
ఆకస ఆసనమును వీడి - లోకమును జూడ వచ్చితివి
ఇంపుగ వాసము చేయుటకు
సొంపుగ లోన - ప్రవేశించుము ప్రవేశించుము‖ 2x ‖
Verse
గుడారమున వసించితివి తోడ నిలిచితివి మేఘమువలె
కొఱతలేక జనుల నడిపితివి
వాక్య ప్రకారము కోరి రమ్ము - నేడు కోరి రమ్ము‖ 2x ‖
Verse
ఇశ్రాయేలీయులతో నేగితివి ఎజ్రాతోడనే యుంటివి
సొలమోను గుడులో వసియించితివి
కాలమెల్ల మాతో నుండుము మాతో నుండుము‖ 2x ‖
Verse
గిరిపైన చూపిన మాదిరిని మరువక సొంపుగ చేసితివి
అక్కరగా మనము లోబడిన
చక్కగా మనలను పాలించును యేసు
Verse
భూమ్యాకాశములు పట్టని వ్యోమపీఠుడు భువికి వచ్చెన్
నీతితో రాజ్యము నేలుటకు
జ్యోతితోడ లోన వచ్చునేసు నేడు వచ్చు నేసు‖ 2x ‖
Verse
హల్లెలూయ పాట చాటింపన్ ఆశతో నిన్నాహ్వానింపన్
ఫలము లనేకము లర్పించన్
ఎల్లరిలోన ప్రవేశించుము ప్రవేశించుము‖ 2x ‖