Chorus
మహిమయుతుడు మా యేసు రాజు
మహిమదూత సైన్యము తోడ
ఇహకు వచ్చున్ మహానందము
Verse
ఇమ్మహి అతిశయిల్లు - దూతలు ఆర్భటించ
దూత వెల్గుతోడ మేఘముపై యేసు
సమ్మతిన్ రాగా సంధింతుము వేగ
ఆ ... ఆనందము
Verse
బూరశబ్దించగానే - వాంచలు తీరుటకు
మిత్రునిచెంత భక్తులందరు చెరి
హర్షంబుతోడ పాడి స్తుతింతుము
ఆ ... ఆనందము
Verse
భూమి గోత్రములును - దేశాధికారులును
ఇమ్మానుయేలుచే న్యాయ తీర్పుపొంద
ఇమ్ముగ మేమును చేరుదు మచ్చట
ఆ ... ఆనందము
Verse
వేయేండ్ల రాజ్యమున భూలోక రాజ్యములు
తీరిన పిదప మిత్రునితో మేము
జయప్రదులమై నిత్యమేలుదుము
ఆ ... ఆనందము