Verse
మహిమోన్నతుడు సర్వశక్తిమంతుడు
నీకు అసాధ్యమంటు లేనేలేదు
నీ రాజ్యం గొప్పది నీ తలంపులు ఉన్నతం
నీలాంటి దేవుడు లేనే లేడు
Verse
నీ కృప చేత నను హత్తుకొని
నా చేయి పట్టి నన్ను నడిపించావు
నీ ప్రేమ వాత్సల్యం నాపై చూపి
ఎడబాయని కృపతో నను హెచ్చించావు
Chorus
నా యేసయ్యా నా సర్వోన్నతుడా
నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా
Verse
బంధకాలను తెంచివేసిన శక్తిమంతుడా నీకే స్తుతులు
ఈ లోక మాలిన్యం దూరపరచిన నజరేయుడా నీకే వందనం
పక్షి రాజువలె నీ రెక్కలపై మోసితివే
శ్రమ అయినా బాధైనా నన్ను ఓదార్చి హత్తుకుంటివే
Chorus
నా యేసయ్యా నా సర్వోన్నతుడా
నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా