Verse
మహెూన్నతుడా నీ నామమనే కీర్తించుటయే ఉత్తమము
సర్వోన్నతుడా నీ మహిమను నే ప్రచురించుటయే భాగ్యము
ఆ.రాధన.. ఆ.రాధన..‖ 2x ‖
Verse
ఉదయమున నీ కృపను గూర్చియు
రాత్రిజామున విశ్వాస్యతను‖ 2x ‖
పదితంతుల స్వరమండలముతో
గంభీర ధ్వనిగల సితారతో‖ 2x ‖
ప్రచురించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము
ఆ.రాధన.. ఆ.రాధన..‖ 2x ‖
Verse
మందిరావరణమున నాటబడి
నిత్యము చిగురించి వర్ధిల్లుచూ‖ 2x ‖
ఖర్జూర వృక్షమువలె నీ వాక్యపు నీడలో ఎదుగుచూ‖ 2x ‖
స్తుతియించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము
ఆ.రాధన.. ఆ.రాధన