Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahonnathudaa

మహోన్నతుడా

Mahonnathudaa

Lyricist: Hosanna Ministries
Verse
మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది
మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట‖ 2x మహోన్నతుడా ‖
Verse
మోడుబారిన జీవితాలను
చిగురింప జేయగలవు నీవు‖ 2x ‖
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు‖ 2x మహోన్నతుడా ‖
Verse
ఆకు వాడక ఆత్మ ఫలములు
ఆనందముతో ఫలియించినా‖ 2x ‖
జీవ జలముల ఊట అయిన
నీ ఓరన నను నాటితివా‖ 2x మహోన్నతుడా ‖
Verse
వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచి యుంచితివా‖ 2x ‖
వాగ్ధాన ఫలము అనుభవింప
నీ కృపలో నన్ను పిలచితివా‖ 2x మహోన్నతుడా ‖

Related Tags

PraiseWorshipGrace