Verse
మహోన్నతుడా మా దేవా
సహాయకుడా యెహోవా‖ 2x ‖
ఉదయ కాలపు నైవేద్యము
హృదయపూర్వక అర్పణము‖ 2x ‖
మా స్తుతి నీకేనయ్యా
ఆరాధింతునయ్యా‖ 2x మహోన్నతుడా ‖
Verse
అగ్నిని పోలిన నేత్రములు
అపరంజి వంటి పాదములు‖ 2x ‖
అసమానమైన తేజో మహిమ
కలిగిన ఆ ప్రభువా‖ 2x మా స్తుతి ‖
Verse
జలముల ధ్వని వంటి కంట స్వరం
నోటను రెండంచుల ఖడ్గం‖ 2x ‖
ఏడు నక్షత్రముల ఏడాత్మలను
కలిగిన ఆ ప్రభువా‖ 2x మా స్తుతి ‖
Verse
ఆదియు అంతము లేనివాడా
యుగయుగములు జీవించువాడా‖ 2x ‖
పాతాళ లోకపు తాళపు చెవులు
కలిగిన ఆ ప్రభువా‖ 2x మా స్తుతి ‖