Verse
మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు
సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు
Verse
ఆయనే నా కోట ఆశ్రయము నే నమ్ముకొను దేవుడు
రక్షించు వేటకాని ఉరి నుండి - పాడు తెగులు నుండి
Verse
తన రెక్కలతో నిను కప్పును నీకు ఆశ్రయంబగును
ఆయన సత్యంబు నీ కేడెమును డాలునై యున్నది
Verse
రేయి భయమునకైనా పగటిలో నెగురు బాణమునకైనా
చీకటిలో తిరుగు తెగులునకైనా - నీవు భయపడవు
Verse
మధ్యాహ్నములో పాడుచేయు రోగమునకు భయపడవు
నీ ప్రక్కను వేయి మంది పడినను నీవు భయపడవు
Verse
నీ కుడిప్రక్కను పదివేల మంది కూలిపోయినను - నీవు భయపడవు
అపాయము నీ దాపున కేమాత్రము రాదు భయపడవు
Verse
భక్తిహీనులకు కల్గు ప్రతిఫలము నీవు చూచెదవు
మహోన్నతునే ఆశ్రయముగా చేసి వసించు చున్నావు
Verse
నీ గుడారమున కపాయము తెగులు సమీపించదు
నీ మార్గంబులలో నిను కాపాడను దూతలకు చెప్పున్
Verse
నీ పాదములకు రాయి తగుల నీక నిన్నెత్తు కొందురు
సింహములను నాగుల భుజంగములను అణగ ద్రొక్కెదవు
Verse
నన్నెరిగి ప్రేమించె గాన నేను వాని ఘనపరతున్
నా నామమున మొఱ్ఱపెట్టగా నేను ఉత్తరమిచ్చెదను
Verse
శ్రమలో తోడై విడిపించి వాని గొప్ప చేసెదను
దీర్ఘాయువుతో తృప్తిపరచి - నా రక్షణ చూపెదను