Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mamathaanuraagaalae Maalalugaa

మమతానురాగాలే మాలలుగా

Mamathaanuraagaalae Maalalugaa

Lyricist: A R Stevenson
Verse
మమతానురాగాలే మాలలుగా
సమతానుబంధాలే ఎల్లలుగా
కట్టబడిన కాపురం - అనురాగ గోపురం
ఈ పరిణయం - యెహోవా నిర్ణయం
Verse
వరుడైన క్రీస్తు వధువైన సంఘమును
ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించె
అటువలెనే పురుషుడు కూడా తన స్వంత దేహమువోలె
భార్యను ప్రేమించ వలెనని యేసయ్య ఏర్పరచినది
Verse
కుమారుడు క్రీస్తు శిరస్సైన తండ్రికి
అన్నివేళలందు విధేయత చూపె
అటువలెనే స్త్రీ కూడా శిరస్సైన పురుషునికి
అన్నిటిలో విధేయురాలిగ ఉండునట్లు ఏర్పరచినది

Related Tags

MarriageLoveWedding