Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mammu Prema Joochi Devudu Maku

మమ్ముఁ ప్రేమఁ జూచి దేవుఁడు మకు

Mammu Prema Joochi Devudu Maku

Lyricist: Jacob Chamberlain
Verse
మమ్ముఁ ప్రేమఁ జూచి దేవుఁడు మకు బోధపరపఁగ ఇమ్ముగాను
లేఖనముల నిచ్చె మాకు భూమిపై‖ మమ్ము ‖
Verse
మా మొగంబు నద్దమందు మేము చూచునట్లు మేము గాన వచ్చు
మాస్థితి మిగులఁ దేటగ నందులో‖ మమ్ము ‖
Verse
పాప మనెడు బురద గోతిని బడిన మమ్ము నెత్తఁగా పాప రహితుండైన
యేసు ప్రాణ మిచ్చెను బ్రేమచే‖ మమ్ము ‖
Verse
పాప మంతయు వీడి మేము భక్తి సరణిని నడువఁగఁ ప్రాపుగాఁ దన
యాత్మ నిచ్చెఁ ప్రాణసఖుఁడగు యేసుండు‖ మమ్ము ‖
Verse
సకల జనులు లేఖనముల సత్యములను దెలియుచు అకలుషముగ
వానినమ్మఁగ నంపు మాత్మను రక్షకా‖ మమ్ము ‖

Related Tags

BibleWord Of GodScripture