Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mana Balamaina Yaakobu Devuniki Gaanamu Santhoshamuga Paadudi

మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడి

Mana Balamaina Yaakobu Devuniki Gaanamu Santhoshamuga Paadudi

Verse
మన బలమైన యాకోబు దేవునికి
గానము సంతోషముగా పాడుడీ
Verse
పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి
సితార స్వరమండలము వాయించుడి
Verse
అమావాస్య పున్నమ పండుగ దినములందు
కొమ్మునూదుడి యుత్సాహముతోడ
యాకోబు దేవుడు నిర్ణయించిన - ఇశ్రాయేలీయుల కది కట్టడ
Verse
తానైగుప్తులో తిరిగినప్పుడు - యోసేపు సంతతికి సాక్షముగ
నిర్ణయించెను దేవుడు అచ్చట - నే నెనుగని భాషను నే వింటిని
Verse
తమభుజము నుండి బరువు దింపగ మోతగంపల భారము దప్పెను
నీవాపదయందు మొఱపెట్టగా - విడిపించిన యెహోవాను నేనే
Verse
ఉరుము దాగుచోటులో నుండినే - ఉత్తరమిచ్చి నిన్ను శోధించితిని
మెరీబా జలముల యొద్ద నిన్ను - నా ప్రజలారా నా మాట వినుడి
Verse
ఇగుప్తు దేశములో నుండి నిన్ను - రప్పించిన యెహోవా దేవుడను
నీవు నీ నోరు బాగుగా తెరువుము - నేను నింపెదను మంచి వాటితో
Verse
అతి శ్రేష్ఠమైన గోధుమలను - అనుగ్రహించి పోషించెద నిన్ను
కొండ తేనెనిచ్చి కడు ప్రేమతో - తృప్తి పరచెదను నిత్యముగా
Verse
అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట - వినిన పక్షాన ఎంత మేలగు
అన్యదేవతల నెవ్వరికిని - నీవు ఎన్నడు పూజ చేయరాదు

Related Tags

PraiseWorshipPsalm