Chorus
మన దేవుని పట్టణమందాయన - పరిశుద్ధ పర్వతమందు
యెహోవా గొప్పవాడును - బహు కీర్తనీయుడై యున్నాడు
Verse
ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన - సీయోను పర్వతము
ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చు చున్నది
Verse
దాని నగరులలో దేవుడాశ్రయముగా - ప్రత్యక్షంబగుచున్నాడు
రాజులేకముగా కూడి ఆశ్చర్యపడి - భ్రమపడి త్వరగా వెళ్ళిరి
Verse
అచ్చట వారల వణకును ప్రసవించు స్త్రీ - వేదన పట్టెను
తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడల - పగులగొట్టుచున్నావు
Verse
సైన్యము లధిపతి యెహోవా దేవుని - పట్టణమునందు
మనము వినినట్టి రీతిగా జరుగుట - మనము చూచితిమి
Verse
మన దేవుడు నిత్యముగా దానిని స్థిర - పరచియున్నాడు
దేవా నీ ఆలయ మందున నీ కృపను ధ్యానించితిమి
Verse
దేవా నీ నామము ఎంత గొప్పదో - నీ సత్కీర్తియును
భూదిగంతముల వరకు అంత - గొప్పదై యున్నది
Verse
ఈ దేవుడు సదాకాలము మనకు - దేవుడై యున్నాడు
మనల నడిపించును మరణపర్యంతము - హల్లెలూయా ఆమెన్