Verse
మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం
మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం‖ 2x ‖
పాపము లేదు పరలోకంలో
వ్యాధులు బాధలు లేనే లేదు
పాపము లేదు పరలోకంలో
వ్యాధులు బాధలు అసలే లేవు
నీ రాజ్యం మాకొచ్చును గాక
నీ చిత్తం భువిపై జరుగును గాక
పరలోక రాజ్యాన్ని ఈ భువిపై మేము
ఇప్పుడే అనుభవిస్తాము‖ 2x ఇక్కడే అనుభవిస్తాము ‖
Verse
సిలువలో మన శాపం తొలగిపోయెను
ఆశీర్వాదముకు మనము వారసులం
దారిద్య్రముతో లేదు మాకు సంబంధం
ఆత్మలో ఫలియించి వర్థిల్లెదం
అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము
కృప క్షేమములే మాకిక సొంతము
అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము
కృప క్షేమములే మా సొంతము‖ నీ రాజ్యం ‖
Verse
ఆలు మగలు ఒకరికి ఒకరు త్యాగ మూర్తులై
కలసి జీవించుటయే పరలోక రాజ్యం
కలతలు లేవు మాకు కన్నీరు తెలియదు
సంతోషముతో మేము సాగిపోతాము
ఈ తరానికి మాదిరిగా మేముంటాము
పరలోక ప్రేమతో కలిసి జీవిస్తాం‖ 2x నీ రాజ్యం ‖