Verse
మన మొదటి తల్లిదండ్రులల్ మాయకు లోనైరి అన్నలారా వారి
కనుగొనలకు సిగ్గు గదుర మోములు వంచి రన్నలారా‖ మన ‖
Verse
తమ నగ్నతను జూడఁ దా మొప్ప లేరైరి అన్నలారా కొన్ని యమరిన
మఱ్ఱాకు లంగంబులను గట్టి రన్నలారా‖ మన ‖
Verse
పరమాత్ముఁ డిడు నాజ్ఞఁ పాలింప లేరైరి అన్నలారా పూర్వ పరి
శుద్ధత నెడబాసి పాపాత్ములై పోయి రన్నలారా‖ మన ‖
Verse
నరవంశజుల కెల్లఁ తరలెఁ దద్దురవస్థ అన్నలారా క్రీస్తు మర
ణంబు మన పాప హరణంబుఁ గావించు నన్నలారా‖ మన ‖